కాల్ మనీ వ్యవహారంలో  చర్యలకు రంగం సిద్ధం ....

Action To Take On Call Money Accused People

11:46 AM ON 16th December, 2015 By Mirchi Vilas

Action To Take On Call Money Accused People

పేదల అవసరాలను ఆసరా చేసుకుని సాగిస్తున్న కాల్ మనీ వ్యవహారంపై దిద్దు బాటు చర్యలు చేపట్టాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేస్తున్న కాల్ మనీ తీరుపై ఇంటాబయటా ఆందోళనలు తీవ్రమవుతున్న నేపధ్యంలో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. సిఎమ్ చంద్రబాబు నిన్నటి రోజున కలెక్టర్లు అలాగే ఎస్పీల మీటింగ్ లో కాల్ మనీ వ్యవహారంపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించినసంగతి తెల్సిందే.

రాజధాని ఇమేజ్ ని దెబ్బతీసే ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేయాలని సిఎమ్ స్పష్టం చేయడం, అంతేకాదు ఇలాంటి ఘటనల వలన అసలు విజయవాడకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని సిఎమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వార్త. హొమ్ మంత్రి తో సహా పోలీసుల తీరుపై సిఎమ్ గుర్రుగా వున్నారని బోగట్టా. బుధవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో కూడా దీనిపై సిమె సీరియస్ గా స్పందించ నున్నారని చెబుతున్నారు.

అందుకే పెద్దయెత్తున దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మొదట్లో కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన విజయవాడ సిపి గౌతం సవాంగ్ 15 రోజుల సాధారణ సెలవులో వెళ్ళగా , సెలవుని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాల్ మనీ వ్యవహారంలో రాజకీయ వత్తిళ్ళ వలెనే సిపి సెలవుపై వెళ్ళారన్న ఆరోపణలు కూడా రావడంతో సెలవు రద్దు చేసే యోచన చేస్తున్నారు. విజయవాడ పటమట సి ఐ దామోదర్ ని ట్రాఫిక్ కి బదిలీ చేయాలని కూడా నిర్ణయించారట. అలాగే ఉదాసీనంగా వున్న పలువురు పోలీసు అధికారులపై కూడా ఈ వ్యవహారంలో బదిలీ వేటు పదనునుంది.

మరోపక్క మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ ఉదంతంపై పూర్తి వివరాలు అందజేయాలంటూ ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం- ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేవీపీ, సుబ్బిరామిరెడ్డి, జైరాంరమేష్, జేడీ శీలం, రఘువీరారెడ్డిలతో కూడిన ఓ బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సిరియక్ జోసెఫ్‌ను మంగళవారం కలిసి ఫిర్యాదు చేయడంతో, కాల్‌మనీ ఆర్థిక అక్రమాలు, మహిళలతో బలవంతంగా నిర్వహించిన సెక్స్ రాకెట్‌ను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడిస్తూ రెండువారాల్లోగా తెలియజేయాలని హెచ్ ఆర్ సి ఆ నోటీసులో పేర్కొంది.

విజయవాడ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేసారు. ప్రాం సరి నోట్లు , కీలక పత్రాలు ఇందులో బయట పడుతున్నాయి.

English summary

The Government Of Andhrapradesh was ready to take a severe action on The accused people who were involved in call money scam in Andhra Pradesh