నటుడు కళాభవన్ మణి మృతి

Actor Kala Bhavan Mani Passes Away

10:24 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Actor Kala Bhavan Mani Passes Away

ప్రముఖ నటుడు కళాభవన్ మణి కాలేయ సంబంధిత వ్యాధితో ఆదివారం సాయంత్రం కన్నుమూసాడు. మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందిన ఇతను ‘అక్షరం’ అనే మలయాళ సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 1971 జనవరి 1న కేరళలోని చలక్కుడిలో జన్మించిన కళాభవన్ సినీ పరిశ్రమకు రాకమునుపు ఆటో డ్రైవర్‌గానూ పనిచేశారు. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 200కు పైచిలుకు సినిమాల్లో విలన్, హాస్య పాత్రల్లో నటించిన కళాభవన్ మణి ‘వాసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నెన్జానుమ్’ (ఈ సినిమానే తెలుగులో ఆర్.పి. పట్నాయక్ ‘శ్రీను వాసంతి లక్ష్మీ’ పేరుతో రీమేక్ చేశారు) సినిమాతో జాతీయ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ) అందుకున్నాడు. విలనిజానికి మిమిక్రీ జోడించి దక్షణాది ప్రేక్షకులకు చేరువైన మణి తెలుగులో ‘జెమిని’, ‘ఆయుధం’, ‘అర్జున్’, ‘నరసింహుడు’, ‘ఎవడైతే నాకేంటి’ సినిమాల్లో నటించిన మణి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా చేసాడు. అంతేకాదు, ఓ సినిమాకు కథ కూడా అందించాడు. ‘‘ఆయన మృతి భాదాకరం’’ అంటూ మణి మృతి పట్ల ప్రధానమంత్రి కార్యాలయం (పి.ఎం.ఓ) సంతాపం తెలిపింది. దక్షిణాది చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు కూడా సంతాపం ప్రకటించారు.

English summary

Mimicry Artist, Villain,Story Writer Kala Bhavan Mani passes Away kerala.He was famous in Telugu from Gemini movie.He was acted in the telugu Films like Narasimhudu,Arjun ,Gemini and few other movies in Telugu