పులిని ఉరి తీశారు.. అందుకే సేవ్ టైగర్ అంటున్నాడు!

Actor Prakash Raj saying that please save tigers

10:33 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Actor Prakash Raj saying that please save tigers

ఎవరైనా కాస్త గాంభీర్యంగా కనిపిస్తే, పులిలా వున్నాడు అంటాం. టైగర్ తో పోలుస్తాం. అంతేకాదు జాతీయ మృగం పులే. మరి అలాంటి పులిని ఉరి తీస్తే... అసలే పులుల సంఖ్య తగ్గిపోతోందని అంటున్నారు. అలాంటి సమయంలో ఇలా జరిగితే ఎలా? పర్యావరణ సమతుల్యాన్ని పులి కూడా అవసరం. అందుకే ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు చేసి సినీ అభిమానులను మెప్పించిన నటుడు ప్రకాష్ రాజ్ దీనిపై స్పందిస్తున్నాడు. ఓ పులి చెట్టుకు వేలాడుతూ ఉరి తీయబడిన దృశ్యం కనిపించడంతో దీనిపై అతడు స్పందించాడు. ఈ మధ్యకాలంలో స్టార్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీస్ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు.

అలాంటి స్టార్స్ లిస్టులో ప్రకాష్ రాజ్ కుడా చేరాడు. కర్ణాటకలోని బందిపూర్ గ్రామంలో సంచరిస్తూ అక్కడి స్కూల్ పిల్లలకి, ఆ గ్రామ ప్రజలకి మన జాతీయ మృగం అయిన పులిని కాపాడుకోవడం మన బాధ్యతనే విషయంపై ప్రకాష్ రాజ్ అవగాహన కల్పిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ 'సేవ్ టైగర్' అనే కాన్సెప్ట్ తో నేషనల్ లెవల్ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ టైగర్ ని సేవ్ చెయ్యడం ఎంత అవసరం అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన కర్ణాటకలోని నాగర్ హోల్ ఫారెస్ట్ లో తిరుగుతూ అక్కడి ప్రజలకి టైగర్ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు. అలా తిరుగుతున్నప్పుడు పులిని ఉరి తీసే దృశ్యం కనిపించడంతో తన ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేసాడు.

English summary

Actor Prakash Raj saying that please save tigers