వీరప్పన్ గా సందీప్ - వర్మ రూటే వేరబ్బా ....

Actor Sandeep As Veerappan In Varma Movie

05:37 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Actor Sandeep As Veerappan In Varma Movie

విలన్ లని సైతం డిఫెరెంట్ గా చూపించి బెస్ట్ విలన్ అవార్డ్స్ కూడా సాధించి పెట్టిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రిలీజ్ చేస్తున్న కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో వీరప్పన్ క్యారక్టెర్ కోసం సందీప్ భరద్వాజ్ ని ఎంచుకుని, తన ప్రత్యేకత చాటుకున్నాడు. సందీప్ ని మేకప్ కు ముందు చూస్తే వర్మ ముందుచూపు అర్ధమవుతుంది.

ఆర్ట్ డైరెక్టర్ భాస్కర రాజు వారసునిగా తెరం గేట్రం చేసిన వర్మ 'శివ' సినిమాతో తెలుగు సినిమాలో సైకిల్ చైన్ బ్యాచిని చూపించి, ట్రెండ్ సెట్టర్ గా నిలచాడు. ఇక 'మనీ' వంటి క్లాసికల్ కామెడీ చేయాలన్నా, తన అభిమాన నటి శ్రీదేవితో క్షణ క్షణం - గోవిందా గోవిందా తీసినా, 'రక్తచరిత్ర' వంటి క్రైమ్ తెర కెక్కించినా, వర్మ స్టైలే వేరు.ఇక బాలీవుడ్ లో సైతం 'రంగీలా' వంటి రొమాంటిక్ సినిమానే కాదు, 'సత్య', 'సర్కార్', 'కంపెనీ' వంటి బ్లాక్ బస్టర్స్ కూడా అందించినా అది వర్మకే చెల్లింది.

హీరోలనే కాదు , రాజకీయ నేతల మీద , పలు వివాద అంశాల మీద అభిప్రాయాలను ట్వీట్ చేసే సత్తా కూడా వర్మ సొంతం. ఎదిఎమైనా వివాదాస్పదం ద్వారా వార్తల్లో కెక్కి, అనుకున్నది అనుకున్నట్టు లక్ష్య సాధనలో పబ్లిసిటీ కొట్టేయడం కూడా వర్మ లాజిక్. అందుకే స్మగ్లర్ వీరప్పన్ ప్రేమ కధను కూడా తెరకు ఎక్కిస్తూ , తన రూటే సెపరేటూ .... అని మళ్ళీ మళ్ళీ నిరూపించు కుంటున్నాడు.

English summary