సినీనటి అంకిత నిశ్చితార్ధం ..

Actress Ankitha Engagement.

04:20 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Actress Ankitha Engagement.

లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అంకిత. నటనతోనూ, అందాల ఆరబోతతోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఆ తరువాత ప్రేమలో పావని కల్యాణ్‌, సింహాద్రి, సీతారాముడు, మనసు మాట వినదు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ సడన్‌గా యూ.ఎస్‌.కు మక్కాం మార్చింది. అక్కడ యూనివర్సల్ స్టూడియోలో సినిమా టెక్నాలజికీ సంబంధించిన కోర్సులో చేరింది. అక్కడ కొంతమంది హాలీవుడ్‌ దర్శకులు దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. భవిష్యత్తులో దర్శకత్వం వహించాలనే కోరిక ఉందో లేదో తెలీదు కాని ఇప్పుడు మాత్రం పెళ్ళికి సిద్ధమయింది.

న్యూజెర్సీకి చెందిన జెపి. మోర్గాన్‌ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మరియు ఎన్నారై అయిన విశాల్‌ జగ్తాప్‌తో వివాహం కుదుర్చుకుంది. ముంబైలో జె.పి.మారియట్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో నవంబర్‌ 6న (శుక్రవారం) వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది.

English summary

Actress Ankitha Engagement. Heroine Ankitha who acted in super hit films like laahiri laahiri laahirilo, simhaadri, manasu mata vinadhu.