విశాల్ ను పెళ్లి చేసుకున్న అంకిత

Actress Ankitha married Vishal in Mumbai

12:43 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Actress Ankitha married Vishal in Mumbai

‘లాహిరి లాహిరి లాహిరి’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన అంకిత ఆ తరువాత ధనలక్ష్మీ ఐ లవ్ యూ, సింహాద్రి, అందరూ దొంగలే దొరికితే, విజయేంద్రవర్మ, మనసు మాట వినదు, రారాజు, ఖతర్నాక్, సీతారాముడు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు చిత్రాలతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లో కలిపి దాదాపు 22 సినిమా ల్లో నటించింది. అయితే అంకిత మొదటి చిత్రం నుండే విపరీతంగా అందాలు వడ్డించింది. దీనితో ఈ అమ్మడుకి బానే అభిమానులు వచ్చారు, అయితే ఏమైందో తెలీదు కానీ ఈ అమ్మడు కి అవకాశాలు తగ్గడంతో సినిమా లకి ఒక్కసారిగా దూరమాయింది.

అప్పటి నుంచి మీడియా ముందుకు ఈ అమ్మడు రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమా లకు దూరం అయిన అంకిత సినిమాకు సంబంధించిన కోర్స్ చెయ్యడానికి న్యూయార్క్ వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ పరిచయమైన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్‌తో ప్రేమలో పడింది.

వీరి ప్రేమ వ్యవహరం పెద్దలకు తెలియడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ముంబాయి వర్లీ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

English summary

Actress Ankitha married Vishal in Mumbai. Hot actress Ankitha married businessman Vishal in Mumbai five star hotel.