నటి బండ జ్యోతి కన్నుమూత

Actress Banda Jyothi Passes Away

12:12 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Actress Banda Jyothi Passes Away

సినీనటి బండ జ్యోతి కన్ను మూసింది. చిత్రపురి కాలనీలోని ఆమె నివాసంలో శనివారం ఉదయం గుండెపోటుతో మరణించింది. హాస్యనటిగా బండ జ్యోతి గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోన్న ఈమె హైదరాబాద్ లోని నానక్ రాం గూడ చిత్రపురి కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విదించింది. ఇటీవల మెల్లగా కోలుకుంటున్న ఆమెకు గుండెపోటు వచ్చిందని, అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. జ్యోతి పలు సినిమాల్లో హాస్య సన్నివేశాల్లో, సహాయ పాత్రల్లో నటించింది. విజయరామరాజు, కళ్యాణరాముడు, అందగాడు, స్వయంవరం, తోకలేని పిట్ట, భద్రాచలం, గణేష్, ఊర్మిళ డైరీ, s.p శంకర్ వంటి పలు తెలుగు సినిమాల్లో తనదైన కామెడీని పండించిన జ్యోతి మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

English summary

Comedy actress Actress Banda Jyothi Passes Away with heart attack in her home in Chitrapuri. She was suffering with illness from few days.She acted in movies like Vijaya Ramaraju,Kalyana Ramudu,Andala Ramudu,Swayamvaram,Thokaleni Pitta and few other movies.