సెట్స్‌లో గాయపడిన సునీల్ హీరోయిన్‌!

Actress got injured in shooting

12:25 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Actress got injured in shooting

మామూలుగా సినిమా షూటింగ్‌ లో హీరోలు ఫైటింగులు చేస్తూ గాయపడతారు, కానీ ఇక్కడ ఒక హీరోయిన్‌ గాయపడింది. వివరాల్లోకెళితే తమిళంలో 'ఎజిల్‌' చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్న నిక్కీ గల్రాని, ఒక యాక్షన్‌ సన్నివేశం చీత్రీకరిస్తుండగా నిక్కీ కుడి చేతి వేలుకి గాయమైంది. ఈ విషయాన్ని నిక్కీనే స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపింది. మళ్లీ తిరిగి కోలుకోవడానికి దాదాపు 3-4 వారాలు సమయం పడుతుందిని చెప్పింది. నిక్కీ ఈ చిత్రంలోనే కాకుండా లారెన్స్‌ నటిస్తున్న 'మొట్ట శివ కెట్టశివ' లో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో సునీల్‌ నటించిన 'కృష్ణాష్టమి' చిత్రంలో కూడా నిక్కీ హీరోయిన్‌గా నటించింది. నిక్కీ త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

English summary

Actress Nikki Galrani got injured in Ezhil movie shooting