బాబా పేరిట బాగోతాలపై జయలలిత సీరియస్

Actress Jayalalitha Comments On Nizampet Sai Temple

11:14 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Actress Jayalalitha Comments On Nizampet Sai Temple

దేవుని పేరిట మోసాలు చేసేవారు, ఆలయాల్లో, మందిరాల్లో డబ్బులు గల్లంతు చేస్తూ, అక్రమాలకు పాల్పడేవాళ్ళు పెరిగిపోతున్నారు. అయితే దీనిపై అక్కడక్కడా నిలదీసేవాళ్ళు వున్నారు. అయితే వీటిల్లో నిజం ఎంత వుందో లేదో గానీ ఈమధ్య ఇలాంటి ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తనవైన హావభావాలు..అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకన్న జయలలిత చాలాకాలం తర్వాత తాజాగా వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ నిజాంపేట్ బాబా టెంపుల్ లో జరుగుతోన్న అవకతవకలపై బాబా ట్రస్ట్ మెంబర్ గా ఉన్న జయలలిత స్పందించింది. కొందరు వ్యక్తులు ఆలయసొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని.. బాబా ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు లెక్కలు చూపించడం లేదని, ట్రస్ట్ మేనేజింగ్ డెరైక్టర్ గా చెప్పుకుంటున్న వ్యక్తి రూ. 25 లక్షలు దుర్వినియోగం చేశారని జయలలిత ఆరోపించింది.

బొట్ల లతాచౌదరి అనే మహిళ వన్ మ్యాన్ షో నడిపిస్తోందని, నిజాంపేట్ షిర్డిసాయి ఆలయంలో ప్రెస్ మీట్ పెట్టిన జయలలిత ఆరోపించింది. అమెరికాలోనూ బాబా గుడిపేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తమకు ఇష్టమైన వారినే ట్రస్టు సభ్యులుగా నియమించుకుని, భక్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తుతూ, ఆలయ పూజారి అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయింది. అయితే జయలలిత ఆరోపణల్లో నిజం లేదని లతా చౌదరి ఖండిస్తూ, జయ తీరును ఎండగట్టారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలుసు.

ఇవి కూడా చదవండి:ఈసారి ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేస్తోంది ...

ఇవి కూడా చదవండి:29మందితో ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సయ్యింది

English summary

Actress Jayalalitha was known for her style of acting and she did many different types of roles in many movies and now she came into news by an issue of Sri Saibaba Temple in Nizampet in Hyderabad.