విడాకులు తీసుకోబోతున్న నటి కల్యాణి?

Actress Kalyani want to take divorce

11:40 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Actress Kalyani want to take divorce

'శేషు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ కల్యాణి. మొదటి చిత్రమే అట్టర్ ఫ్లాప్ అయినా ఆ తరువాత రవితేజ సరసన ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ సక్సెస్ తో టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. జగపతిబాబు, రవితేజ, వెంకటేష్, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తరువాత అప్ కమింగ్ హీరోయిన్ల పోటీ ఎక్కువ అవ్వడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

ఆ తర్వాత 'సత్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సూర్యకిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం ఇద్దరి కెరీర్ కూడా ఆశించినంతగా సాగలేదు. దీంతో ఇద్దరూ పూర్తిగా వేరే రంగాల్లో బిజీ అయిపోయారు. టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా మంచి కీర్తిని సంపాదించుకున్నారు. అయితే తాజాగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆదర్శ జంట విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకూ గుట్టుచప్పుడు కాకుండా ఉన్న ఈ జంట విషయంలో ఒక్కసారిగా ఇలాంటి వార్త రావడంతో టాలీవుడ్ ఆశ్యర్యానికి గురౌతుంది.

ఏది ఏమైనా ఇన్నాళ్లు అన్యోన్యంగా కలిసి ఉన్న జంట విడిపోతుందన్న వార్త ప్రేక్షకులను కలవర పెడుతోంది. అయినా సెలబ్రిటీల జీవితంలో ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతూనే ఉంటుంటాయి గుసగుసలాడుకుంటున్నారు.

English summary

Actress Kalyani want to take divorce