కృష్ణ వంశీ వాడకం అలానే వుంటుందట

Actress Pragya Jaiswal Special Role In Nakshatram Movie

10:42 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Actress Pragya Jaiswal Special Role In Nakshatram Movie

మా వాడకం ఎలా ఉంటుందో చూద్దురు గాని అంటూ దూకుడులో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ అదే డైలాగ్ నిజంగా నిజం చేస్తున్నాడట సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందుతున్న తన లేటెస్ట్ మూవీ నక్షత్రంలో కృష్ణ వంశీ వాడకం ఎలా ఉందంటే వివరాల్లోకి వెళ్ళాలి. ఈ మూవీలో ఇప్పటికే ఓ గెస్ట్ రోల్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని కృష్ణ వంశీ తీసుకున్నాడు. 20 నిమిషాలు వుండే ఈ క్యారెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు. అలాగే మరో యంగ్ హీరో తనీష్ ఓ నెగటివ్ రోల్ చేయనున్నాడు.

ఇక ఇప్పుడు ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా గెస్ట్ రోల్ చేస్తోందట. క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె మూవీలో సీతగా తన అందం అభినయంతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ నక్షత్రంలో ఓ పోలీస్ క్యారెక్టర్ చేస్తుందట. అంతేకాదు ఈ మూవీలో ప్రగ్యాతో ఫైట్స్ కూడా కృష్ణ వంశీ చేయించబోతున్నాడట. డైరెక్టర్ సలహా మేరకు ప్రగ్య ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ అవుతోందట. అమ్మో.. వంశీ సార్ ది మామూలు వాడకం కాదని, ఈ సినిమాకోసం కృష్ణవంశీ తనను మరీ పిండేసేలా ఉన్నారే.. అంటూ తన ఫ్రెండ్స్ దగ్గర కృష్ణవంశీ గురించి ప్రగ్యా గొప్పలు పోతోందట. నెగిటివ్ గా కాకుండా ఇలా పాజిటివ్ గా వాడకం గురించి చెప్పడం ఏమిటబ్బా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చూడండి: నెట్ లో హల్ చల్ చేస్తున్న మెగాస్టార్ మనువరాలు హాట్ ఫొటోస్

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

English summary

Actress Pragya Jaiswal Special Role In Nakshatram Movie directed by creative director krishna vamshi.