మంత్రాలయంలో నిన్నటి హీరోయిన్...

Actress Prema in mantralayam

12:54 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Actress Prema in mantralayam

టాలీవుడ్ లో నిన్నటి హీరోయిన్లు చాలామంది పెళ్లిళ్లు అయిపోయాక సంసార జీవితంలో వున్నారు. ఇందులో కొందరు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలెట్టేసాడు. ఇక ధర్మచక్రం, దేవి వంటి చిత్రాలలో నటించి అలరించిన నిన్నటి హీరోయిన్ ప్రేమ తెలుగు తెరకు దూరమై చాలాకాలమే అయింది. అయితే కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూలబృందావనం దర్శనార్థం ప్రేమ గురువారం వచ్చింది. ఈమె ముందుకు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని కుంకుమార్చన, మహామంగళ హారతి పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఈమెకు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పట్టుచీర, ఫల పుష్ప మంత్రాంక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు. మఠం అర్చకుడు శ్రీపాదాచార్ కూడా వున్నారు.

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ పై సెలెబ్రిటీలు షాకింగ్ కామెంట్స్...

ఇది కూడా చదవండి: ఆనాటి రూపాయి వెలువ ఎంతో తెలుసా?

ఇది కూడా చదవండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

English summary

Actress Prema in mantralayam. 1990's heroine Prema visits panchamukhi anjaneya temple mantralayam.