చెన్నై బాధితులకు రంభ విరాళం!

Actress Rambha donated 5 lakhs to Chennai floods victims

10:45 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Actress Rambha donated 5 lakhs to Chennai floods victims

'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి ఆ తరువాత తన అందాలతో తెలుగు చిత్ర పరిశ్రమని ఊపు ఊపిన అందాల నటి 'రంభ' ఆ తరువాత సినిమాలకి గుడ్‌బై చెప్పి 2010లో ఇంద్రన్‌ పద్మనాధన్‌ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని కెనడాలో స్ధిరపడంది. అయితే చెన్నై లో సంభవించిన వరద భీవత్సం గురించి ఆలస్యంగా తెలుసుకున్న రంభ వెంటనే చెన్నై వరద బాధితులకి 5 లక్షలల రూపాయల విరాళాన్ని పంపించింది. తెలుగు సినిమాతో పరిచయమైన రంభ ఆ తరువాత తమిళంలో కూడా మంచి చిత్రాల్లో నటించి తమిళ వాళ్లకి కూడా చేరువైంది.

వరదలు విషయాన్ని తెలుసుకున్న రంభ తన దగ్గర బంధువుతో నడిగర్‌ సంఘం అనే సామాజిక సంస్ధకు విరాళాన్ని ఇచ్చి పంపించింది. మరో పక్క రంభ అభిమానులు మళ్లీ తనని తెర పై చూడాలని భావిస్తున్నారు. రంభ మాత్రం అందరికీ దూరంగా వెళ్లి తన సంసార జీవనాన్ని సాగిస్తుంది.

English summary

Actress Rambha donated 5 lakhs to Chennai floods victims.