ఆర్ఎస్ఎస్- బీజేపీలపై రమ్య ఫైర్!

Actress Ramya shocking comments on BJP and RSS parties

12:58 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Actress Ramya shocking comments on BJP and RSS parties

ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఇరుక్కున్న సినీనటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. నేతలు చెబుతున్నట్టుగా పాకిస్థాన్ నరకం కాదని, అందరు తనను బాగానే చూశారంటూ రీసెంట్ గా ఆమె చేసిన వ్యాఖ్యలపై రేగిన మంటలు చల్లారకముందే కొత్త దుమారం మొదలైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లే వచ్చిందని ఆమె కామెంట్ చేసింది. మంగళవారం మండ్య పట్టణంలోని ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. ఆర్ఎస్ఎస్- బీజేపీలు ఎక్కడున్నాయని ఆమె ప్రశ్నించింది.

బ్రిటీష్ వాళ్ళతో కలిసిపోయారా అని అడిగింది. ఇలాంటి వాళ్ల దగ్గర దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిరావడం విడ్డూరంగా వుందన్నారు. దీనిపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు మండిపడుతున్నాయి. ఏదోవిధంగా వార్తలోకి రావాలనే ఆరాటంతోనే నటి ఇలాంటి ఆరోపణలు చేసివుండవచ్చని అంటున్నారు. ఇంతకీ మాజీ ఎంపీ హిస్టరీ చదువుకున్నారా లేరా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఈమె వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు సైలెంట్ అయ్యారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, కోర్టు కేసు ఎదుర్కొంటున్న రాహుల్ ని మించిపోయి రమ్య విమర్శలు గుప్పిస్తోంది.

ఇది కూడా చదవండి: నువ్వా నేనా అంటూ తలపడ్డాయి(ఫోటోలు)

ఇది కూడా చదవండి: యాపిల్ కంపెనీకు దిమ్మ తిరిగే షాక్!

ఇది కూడా చదవండి: ఖైదీలో మెగా డాటర్?

English summary

Actress Ramya shocking comments on BJP and RSS parties.