లవ్ ఎఫైర్ లో పోలీసుల సాయం కోరిన సినీనటి(వీడియో)

Actress Siripriya goes to police station

11:55 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Actress Siripriya goes to police station

ఈమధ్య ఏదో వంకన పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా లవ్ ఎఫైర్ లో సినీనటి సిరిప్రియ పోలీసుల సాయం కోరింది. బీటెక్ చదువుతున్న ప్రసన్నకుమార్ ను తాను వివాహం చేసుకున్నానని, అయితే తన భర్త కుటుంబం నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున రక్షించాలని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులకు ఆమె విన్నవిస్తూ, స్టేషన్ కి వెళ్ళింది. సిరిప్రియ అసలు పేరు చంద్రకళ. ఈమె నటించిన 'ఆమె కోరిక' సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ లోనూ సిరిప్రియ నటించింది. ప్రసన్న కుమార్ ఫేస్ బుక్ లో పరిచయం కాగా గత ఆరేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారం క్రితం వివాహం చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించిన అనంతరం మీడియాతో సిరిప్రియ మాట్లాడుతూ గతంలో యూట్యూబ్ లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశానని తెలిపింది. అయితే వృత్తిలో భాగంగా చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రసన్న కుమార్ కుటుంబం తన క్యారెక్టర్ ను అనుమానిస్తోందని సిరిప్రియ వ్యాఖ్యానించింది. తను ప్రసన్నకుమార్ ను వలలో వేసుకోలేదని ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. బతుకుదెరువు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని త్వరలో ఏదో ఒక పని చూసుకుంటానని వివరించింది. అదండీ సంగతి.

English summary

Actress Siripriya goes to police station