యాక్టింగ్ కోసం ట్రై చేసి  బెగ్గర్ అవతారం...

Actress Turned Into Beggar

09:45 AM ON 28th April, 2016 By Mirchi Vilas

Actress Turned Into Beggar

కొన్ని సినిమా కధలు అంటాం .. కానీ ఇది నిజం జీవితంలో గాధ .. బాలీవుడ్ లో ట్రాజడీ స్టోరీ ఇది. కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ నటి.. చివరకు దొంగతనం చేయడం ఆ తర్వాత ముష్టి ఎత్తుకోవడం వరకూ వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే, ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల మిటాలి శర్మ. గ్లామర్ ఇండస్ర్టీలో సెటిల్ కావాలని వేయికళ్లతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమెను పేరెంట్స్ వదిలేశారు. ఐతే, ముంబైలోని లోకండ్వాలా ఏరియాలో దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తున్న టైంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి శర్మ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై దొరికిపోయింది. చింపిరి జుట్టు, చిరిగిన డ్రెస్తో మిటాలి కనిపించింది. ఇక పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూసాయి.

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

చాలాకాలం ముష్టెత్తుతూ బతుకుతోందని, కడుపు నింపుకోవడానికి డబ్బులు రాని టైమ్లో చిన్న చిన్న దొంగతనాలు చేసినట్టు తేలింది. ఆమె పోలీసులకు చిక్కినప్పుడు రెండు రోజులుగా ఏమీ తినలేదని, తనకు ఏమైన తినటానికి పెట్టమని కోరిందట. మోడల్ అయిన మిటాలి శర్మ, భోజపురి మూవీలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం ప్లాపై అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మిటాలిశర్మ మానసిక పరిస్థితి నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఐతే, ఆమె ఫ్యామిలి ఎక్కడుందో పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు . విధి రాత అంటే ఇది. దీన్ని ఎవరూ తప్పించలేరు.

ఇవి కూడా చదవండి:

ఈ రెండు రోజుల్లో అప్పు ఇవ్వకూడదా ?

పాముకి తలలో నాగమణి ఉంటుందా?

మొదలైన పవన్ కొత్త సినిమా

English summary

A Heroine named Mithali Sharma was came out from her house to become a good actress she acted in one Bhojpuri movie also but that film became flop and she did not get any chances in the industry. She caught to police when she was trying to theft and she said that she turned as beggar and she asked police to give some fodd to eat because she did not eat anything from past two days.