ఆ క్షణంలో పడ్డ కష్టం అంతా ఇంతా కాదట

Adah Sharma About Kshanam Movie

09:53 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Adah Sharma About Kshanam Movie

ఫస్ట్ సినిమాతోనే ఫాస్ట్ గా మూవ్ అయిన అదా శర్మ ఆ తర్వాత తెలుగు పరిశ్రమకూ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో మెప్పి స్తోంది. ‘1920’ అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ తాజాగా ‘క్షణం’ సినిమా లో ఓ ప్రధాన పాత్రలో నటించింది. పీవీపీ సంస్థ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్‌తో ఇప్పటికే అంతటా మంచి ఆసక్తి రేకెత్తించింది. రిలీజ్‌కు ముందు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్‌ సొంతం చేసుకున్న ఈ సినిమాలో అడవి శేష్, అనసూయ, సత్యదేవ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శక త్వం వహించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 26నే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా రిలీజ్‌కు రెడీ అయిపోయిన సందర్భంగా అదా శర్మ మీడియాతో మాట్లాడుతూ..“నా ఫస్ట్ సినిమా ‘1920’ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ‘క్షణం’ లో కష్టపడ్డా. ఇందులో నా నిజ జీవితానికి ఏమాత్రం పరిచయం లేని ఒక పాత్రను చేయాల్సి వచ్చింది. అందుకే చాలా కష్టపడ్డాల్సివచ్చింది. రవికాంత్ ఒక డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించాలని చేసిన ప్రయత్నం, పీవీపీ సినిమా కమిట్‌మెంట్ ఈ సినిమాను మరో ఎత్తులో నిలబెట్టాయి. శేష్, సత్య, అనసూయ.. అందరితో షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఇలాంటి ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నా” అని వివరించింది. ప్రస్తుతం తెలుగులోనే వరుసగా అవకాశాలు వస్తున్నాయని ఆదా చెబుతూ, త్వరలోనే కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో భాగం కానున్ననట్లు కూడా చెప్పింది.

English summary

Adah Sharma was introduced by Director Purijagannadh in Heart Attack movie and later she got a chance with allu arjun in Son of Satya Murthy film.Recently she acted in Garam movie with Aadi.Her upcoming film was Kshanam movie which was directed by Ravikanth and produced by PVP cinemas.She says that she worked hard for this movie and this movie was going to be get good response from the audience.