సూపర్ మచ్చి ... అంటూ కవ్విస్తోందా?

Adah sharma super machi song performance

03:21 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Adah sharma super machi song performance

తెలుగు ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన నటి అదాశర్మ హార్ట్ ఎటాక్ , సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాల లో నటించింది. తాజాగా అదాశర్మ బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ సరసన విపుల్ షా నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘కమాండో-2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సింగపూర్ లో నిర్వహిస్తున్న సైమా అవార్డుల వేడుకకు ఈ ముద్దుగుమ్మ హాజరు కావడం లేదట. ప్రస్తుతం తాను బాలీవుడ్ సినిమా ‘కమాండో-2’ షూటింగ్ లో ఉన్నానని, ఒకే రోజు రెండు ప్రదేశాల్లో ఉండేలా ఏం చేయాలో తెలియడం లేదని ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఈ సారి సైమాకు హాజరు కావడం లేదా? పర్ఫామెన్స్ ఇవ్వడం లేదా? అని కొందరు అడిగిన ప్రశ్నలకు అదాశర్మ సమాధానం ఇచ్చింది. అంతేకాదు వేదికపై పర్ఫామెన్స్ అంటూ.. అభిమానుల కోసం తాను నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలోని ‘సూపర్ మచ్చి’ పాటకు డ్యాన్స్ వేసి ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఇది కూడా చూడండి: నిమిషానికి క్రికెటర్ల సంపాదన తెలిస్తే షాకే

ఇది కూడా చూడండి: ఈ పిల్లాడి తిండి కోసం ఆప్పులపాలయ్యారు

ఇది కూడా చూడండి: దేశాధ్యక్షుడు చెప్పాడని నగ్నంగా పనిచేస్తున్నారు (ఫొటోస్)

English summary

Adah sharma super machi song performance.