బాలకృష్ణ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు

Adarsh Balakrishna getting marry in may

04:16 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Adarsh Balakrishna getting marry in may

అవునా, బాలకృష్ణేంటి పెళ్లి చేసుకోవడమేంటి.. ఒకవేళ ఇదేమైనా ‘గౌతమపుత్ర శాతకర్ణి’ కి సంబంధించిన సన్నివేశమా? ఇలా రకరకాల ప్రశ్నలు రావడం సహజం. అయితే ఇక్కడ నందమూరి బాలకృష్ణ గురించి కాదండోయ్... ఇండస్ట్రీలోని మరో బాలకృష్ణ గురించి. ఆదర్శ్ బాలకృష్ణ పేరుతో టాలీవుడ్లో ఓ యువ నటుడు ఉన్నాడండీ. హ్యాపీ డేస్, వినాయకుడు, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లు చేసి టిపికల్ బాడీ లాంగ్వేజ్.. వాయిస్ మాడ్యులేషన్ తో మంచి పేరు సంపాదించిన ఆదర్శ్ బాలకృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత మార్చిలోనే అతడికి నిశ్చితార్థం అయింది.

ఇది కూడా చదవండి: తాగేసి షూటింగ్ లో రొమాన్స్ చేసిన నైరా బెనర్జీ

మే 28న హైదరాబాద్ లో ఘనంగా పెళ్లి జరబోతోంది. ఆదర్శ్ పెళ్లి వెనుక ఓ ఇంటరెస్టింగ్ కథ కూడా ఉంది. అతను సినిమాటిక్ స్టయిల్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొన్ని నెలల కిందట ఓ స్నేహితుడి పెళ్లి కోసం ఢిల్లీకి వెళ్లాడట. ఆ పెళ్లిలో గుల్నార్ అనే అమ్మాయిని చూసి చూడగానే లవ్ లో పడిపోయాడట. ఆమె దగ్గరికి వెళ్లి నంబర్ అడిగితే ఇవ్వలేదట. తర్వాత ఏదేదో చేసి చివరికి నంబర్ సంపాదించాడట. ఆ పై మాటలు కలిశాయి. ఇద్దరూ కలిసిన రెండో మీటింగ్ లో ప్రేమ పుట్టింది. మూడో సిటింగ్ లో గుల్నార్ తల్లిదండ్రుల్ని ఆదర్శ్ కలిశాడట. నాలుగో మీటింగ్లో పెళ్లికి ముహూర్తం ఖరారైంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటున్న సమంత!

ఆదర్శ్ సినిమా కెరీర్ బానే నడుస్తోందిప్పుడు. కుర్రాడికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉండటంతో అవతలి వైపు నుంచి త్వరగానే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇంతకీ ఆదర్శ్ పెదనాన్న ఎవరంటే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్నందున ఇటు సినీ, అటు పొలిటికల్ టచ్ తో ఆదర్శ్ పెళ్లి అదరహో అవుతుంది.

ఇది కూడా చదవండి: రఘుబాబు ఇంట్లో విషాదం!

English summary

Adarsh Balakrishna getting marry in may. Tollywood actor Adarsh Balakrishna getting marry in may.