ట్విట్టర్ పక్షికి అదనపు ఫీచర్లు..

Added more features in Twitter

01:16 PM ON 1st December, 2016 By Mirchi Vilas

Added more features in Twitter

సోషల్ మీడియాలో కీలకమైన ట్విట్టర్ ఎప్పటికప్పుడు అదనపు హంగులు తెచ్చుకుంటోంది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ట్విట్టర్ మొబైల్ యాప్ కి రిప్లై కౌంటర్, కన్వర్సేషన్ ర్యాంకింగ్ అనే రెండు కొత్త ఫీచర్లు జతకానున్నాయి. వినియోగదారులు ట్విట్టర్ ను వాడే విధానంలో వీటివల్ల ఏమీ మార్పు రాదు, కానీ ట్వీట్లకు సమాధానాలను క్రోనోలాజికల్ ఆర్డర్లో చదవలేం. కన్వర్సేషన్ ర్యాంకింగ్ ఫీచర్ ద్వారా ఒరిజినల్ పోస్టర్ రిప్లైస్, ఫాలో అవుతున్న వారి రిప్లైస్ పైన కన్పిస్తాయి. దాంతో వినియోగదారులు సంభాషణ ఏ విషయం మీద జరిగిందన్నది తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు.

విషయాన్ని బట్టి ట్విట్టర్ ఈ సంభాషణల్ని గ్రూపులుగా కూడా మారుస్తుంది. ఇక రిప్లై కౌంటర్ అయితే పేరుకు తగ్గట్లుగా స్పష్టంగా ఆ ట్వీట్ కింద ఎంతమంది డైరెక్ట్ గా ఆ ట్వీట్ కి సమాధానాలిచ్చారో కూడా చూపిస్తుంది.

English summary

Added more features in Twitter