డ్యూటీలో చేరిన మూడు రోజుల్లోనే.. ఎస్సై ఏం చేసాడో తెలుసా?

Adilabad SI get suicide due to depression

02:54 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Adilabad SI get suicide due to depression

గత 15 రోజుల కిందట కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిని మరువక ముందే పక్షం రోజుల్లోనే మరో యువ ఎస్సై ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడు రోజుల కిందటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి పోలీసు సబ్-ఇన్స్పెక్టరుగా బాధ్యతలు చేపట్టిన కాశమేని శ్రీధర్ మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు.

తన క్వార్టర్స్ లోనే సర్వీసు రివాల్వర్ తో కుడి కణతపై కాల్చుకుని తనువు చాలించడం సంచలనం సృష్టిస్తోంది. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

1/6 Pages

ఎంసీఏ పూర్తిచేసి...


కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన కాశమేని ధర్మయ్య, స్వతంత్ర దంపతుల కుమారుడే శ్రీధర్. మత్య్సకారుడైన ధర్మయ్య పిల్లలను కష్టపడి చదివించాడు. ఎంసీఏ పూర్తి చేసిన శ్రీధర్ 2013లో కానిస్టేబుల్ పరీక్షలకు హాజరై మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. మెట్ పల్లి, వేములవాడల్లో పని చేశాడు. 2014లో ఎస్సై పరీక్షలోనూ ఎంపికయ్యా డు. శిక్షణ తర్వాత ఈనెల 27న కెరమెరి పోలీసు స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టాడు. విధుల్లో చేరిన తర్వాత మూడు రోజుల్లోనే సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని చనిపోవడం చర్చనీయాంశమైంది.

English summary

Adilabad SI get suicide due to depression. Adilabad SI Ramakrishna Reddy gets suicide due to heavy depression.