అడవి శేష్ బాలీవుడ్ ట్రయల్స్

Adivi Sesh To Remake Kshanam In Bollywood

06:27 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Adivi Sesh To Remake Kshanam In Bollywood

కర్మ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమైన అడివి శేష్ తన మొదటి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో చేసిన నెగటివ్ రోల్ అడివి శేష్ కు మంచి పేరు తీసుకు వచ్చింది . ఇటీవల తాను స్వయంగా కథ అందించిన క్షణం సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా గురించి అడివి శేష్ మాట్లాడుతూ ఈ సినిమా తెరకెక్కించడం పై మొదట భయపడ్డాడట . సినిమా విడుదలైయ్యాక మొదటి రోజున తలకు టోపీ , కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని సినిమా ధియేటర్ కు వెళ్ళాడట . సినిమా చూస్తూనప్పుడు వారి నుండి వచ్చిన స్పందన చూసి చాలా అనందం కలిగిందట.

ఇది ఇలా ఉంటే ఇక అసలు విషయానికి వస్తే క్షణం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయ్యనున్నారట . ఈ సినిమా కథ వేరే వాళ్ళ చేతికి వెళ్ళడం ఇష్టం లేదని , హిందీలో కుడా తానే చేయ్యనున్నట్లు తెలిపాడు . బాలీవుడ్ లో ఒక మంచి యాక్టర్ గా నిలదోక్కుకోవాలనే లక్ష్యం తోనే తానూ సినీ పరిశ్రమకు వచ్చానని , ఇప్పటికే చాలా బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నప్పటికీ మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

ఇలా టాలీవుడ్ లో తన టాలెంట్ తో దూసుకుపోతున్న అడివి శేష్ త్వరలోనే బాలీవుడ్ లో కుడా దూసుకుపోవాలని కోరుకుందాం.

English summary

Presently Young Hero Adivi Shesh was enjoying the success of Kshanam movie.Now Adivi Shesh Said that he was planning to Remake Kshanam movie in Bollywood.