కల్తీ మద్యం కేసు విచారణకు సిట్ 

Adulterated liquor case Investigation

03:12 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Adulterated liquor case Investigation

విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటైంది. సిఐడిడిఐజి మహేష్ చంద్ర చడ్డా సిట్ అధికారిగా నియమితులయ్యారు. స్వర్ణ బార్ లో సేవించి , 5 గురు మరణించగా , 20మందికి పైగా అస్వస్తులైన సంగతి తెల్సిందే.ఈ కేసులో 9 మంది పై కేసు పెట్టగా , 9వ ముద్దాయిగా కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎం ఎల్ ఎ మల్లాది విష్ణు పేరు నమోదు చేసారు. సిఎమ్ చంద్రబాబు అక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర , డిజిపి జెవి రాముడు , పలువురు నాయకులు భాదితులను పరామర్శించారు. విచారణకు సిఎమ్ ఆదేశించడంతో సిట్ ఏర్పాటుచేసారు. నిజా నిజాలు తెలాకే దోషులపై చర్యలు చేపడతామని డిజిపి రాముడు స్పష్టం చేసారు. 'ఈ బార్ నాది కాదని , నా బందువలదని ' మల్లాది విష్ణు చెప్పడమే కాక , మినరల్ వాటర్ కలుపుకున్న వారి పరిస్థతి బానే వుందని , వాటర్ కూలర్ లోనే తేడా వుందని , ఎవరో కుట్ర చేసి , ఏదో కలిపి ఉంటారని ఆయన అనుమారం వ్యక్తం చేసారు.

ఈ ఘటన పై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయగా , పలు పార్టీలు ఖండించాయి. వైస్సార్ సిపి అధినేత జగన్, వివిధ పార్టీల నేతలు భాదితులను పరామర్శించారు. కృష్ణ లంక ఘటనతో ఎక్సైజ్ శాఖలో కదలిక వచ్చింది. స్వర్ణ బార్ ని సీజ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్ లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని బ్రాండ్ల ను కూడా నిషేదించారు. కాగా సిట్ బృందం కృష్ణ లంక స్వర్ణ బార్ లో వీడియో పుటేజ్ పరిశీలించింది.

English summary

Adulterated liquor case Investigation has given to special investigation team. CIDDIG Mahesh Chandra Chadda has appointed to lead this case