గాల్లో వేలాడుతూ.. పెళ్లి చేసుకున్న జంట(వీడియో)

Adventurous marriage in Kolhapur

04:29 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Adventurous marriage in Kolhapur

మాములుగా పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటారు.. అంటే దానర్ధం స్వర్గంలో పెళ్లి జరుగుతుంది అని కాదు.. స్వర్గంలో ఎవరు-ఎవరికి అని నిశ్చయం అవుతుందని. ఇక్కడ వరకు బానే ఉంది. అయితే పెళ్లి భూమి-ఆకాశాల మధ్య జరుగుతుందని ఎవరూ చెప్పలేదుగా. అందుకే మా పెళ్ళి గురించి నభూతో నభవిష్యతి: తరహాలో నాలుగు కాలాలపాటు చెప్పుకోవాలనుకుంది ఈ జంట. దీనికోసం ఓ వ్యూహం కూడా రచించారు. దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... పెళ్లికి రెడీ అయిన ఆ యువతీయువకులు ఇద్దరూ ధైర్యవంతులే! కొల్హాపూర్ కు చెందిన ఫార్మా బిజినెస్ మెన్, మౌంటెనీర్ అయిన జయదీప్ జాధవ్- ఐఏయస్ కు ప్రిపేర్ అవుతున్న రేష్మాపటేల్ లు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు.

1/4 Pages

ఇందుకు ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలేం అక్కర్లేదు.. సింపుల్ గా మెస్ట్రన్ ఘాట్స్ లోయల్లో, భూమికి 600 అడుగుల ఎత్తులో పెళ్లి వేదిక ఫిక్స్ చేసుకున్నారు. దీనికి కోల్హాపూర్ వెస్ట్రన్ మౌంటెన్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ వినోద్ కాంబ్ జీ అరేంజ్మెంట్స్ చేశారు. ముందుగా పెళ్లికూతురు, పెళ్లి కొడుకులిద్దరినీ వెస్ట్రన్ ఘాట్స్ లో 3000 అడుగుల ఎత్తు ఉండే విశాల్ ఘఢ్, పన్హాలా లోయ ప్రాంతానికి 15 కిలోమీటర్లు దిగువనేవున్న బట్టాలి గ్రామానికి చేర్చారు. వాళ్ళిద్దరినీ డబుల్ నైలాన్ తాడు సపోర్ట్ తో భూమి నుంచి గాలిలోకి 600 అడుగుల ఎత్తుకు లేపారు. సరిగా ముహూర్త సమయానికి ధగధగలాడే పెళ్లి కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతూ జాధవ్, రేష్మాలిద్దరూ ఆాకాశమంత ఎత్తులో ఒకటయ్యారు.

English summary

Adventurous marriage in Kolhapur