న్యాయవాదిని కారులోనే సజీవ దహనం చేసేసారు(వీడియో)

Advocate murdered in Keesara

11:20 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Advocate murdered in Keesara

నేరాలు ఘోరాలకు హద్దు లేకుండా పోయింది. మర్డర్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. పైగా క్రూరంగా, దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కీసరలో ఓ న్యాయవాదిని దుండగులు దారుణంగా కారులోనే సజీవదహనం చేసేశారు. పెట్రోలు పోసి మృతదేహాన్ని కూడా దహనం చేయడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడి బట్టలు, ఇతర వస్తువుల ఆధారంగా ఆ న్యాయవాదిని కుషాయిగూడకు చెందిన ఉదయ కుమార్ గా గుర్తించారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కీసర సిఐ గురవా రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Advocate murdered in Keesara