హీటెక్కిస్తున్న ఐష్-రణబీర్ కెమిస్ట్రీ(వీడియో)

Ae Dil Hai Mushkil movie teaser

12:54 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Ae Dil Hai Mushkil movie teaser

అందం ఐశ్వర్యారాయ్ సొంతం అన్నట్లు వ్యవహారం ఉందని సినీ లవర్స్ చెప్పేమాట. దీన్ని నిజం చేస్తూ ఈ వయస్సులో కూడా ఐష్ దుమ్ము రేపేస్తోంది. తాజాగా ఐశ్వర్యరాయ్ నటించిన యే దిల్ హై ముష్కిల్ టీజర్ రిలీజైన కొన్నిగంటల వ్యవధిలో 3 లక్షల హిట్స్ కు చేరడంతో అంతా ఖంగు తిన్నారు. ఇక యూనిట్ ఫుల్ ఖుషీ అయిపోయింది. రణబీర్ కపూర్- ఐశ్వర్యరాయ్- అనుష్కశర్మ కాంబోలో రానున్న ఈ ఫిల్మ్ కి సంబంధించి, నిమిషమున్నర నిడివిగల ఈ వీడియోలో రణబీర్ కపూర్- ఐశ్వర్యల మధ్య కెమిస్ర్టీ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఐశ్వర్య మునుపటి కంటే మరింత అందంగా కనిపించింది.

ఇదే స్పీడ్ ఆమె కంటిన్యూ చేస్తే హీరోయిన్ గా బిజీకావడం ఖాయమంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. టీజర్ కు సినీ ప్రముఖుల నుంచే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రణబీర్ తో ఫస్ట్ టైమ్ ఐశ్వర్య నటిస్తోంది. అంతేకాదు వీళ్లిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు టోటల్ గా సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతోంది యూనిట్. అంతా ఓకే జరిగితే దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచనగా వుంది. ఈ పిక్చర్ కోసం అప్పుడే అభిమానుల్లో కోలాహలం నెలకొంది.

ఇది కూడా చదవండి: యాపిల్ కంపెనీకు దిమ్మ తిరిగే షాక్!

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: ఈ 10 రకాల అమ్మాయిలతో డేటింగ్ చాలా డేంజర్

English summary

Ae Dil Hai Mushkil movie teaser. Aishwarya Rai and Ranbir Kapoor, Anushka Sharma latest movies Ae Dil Hai Mushkil movie teaser was out.