విమానం కూలి 62 మంది మృతి

Aeroplane Crashes at Rostov Airport in Russia

10:05 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Aeroplane Crashes at Rostov Airport in Russia

మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుని విషాదం మిగిల్చింది. ఈ ప్రమాదం రష్యాలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం దుబాయ్‌కు చెందిన ప్యాసింజర్‌ విమానం రష్యాలోని రోస్తవ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది, 55మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం దుబాయ్‌ నుంచి ప్రయాణికులతో రష్యాలోని రోస్తవ్‌ బయల్దేరింది. రష్యాలోని రోస్తవ్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగి కుప్పకూలింది. ఈ ప్రమాదంతో రోస్తవ్‌ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఘటనాస్థలికి చేరుకున్న విమానయాన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

English summary

A passenger jet has crashed in the southern Russian city of Rostov-on-Don, killing all 55 passengers and seven crew on board. 62 people were died in this incident