జమ్మూ లో కూలిన హెలికాఫ్టర్

Aeroplane Crashes In Jammu Kashmir

06:12 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Aeroplane Crashes In Jammu Kashmir

జమ్మూ కాశ్మీర్ లోని కాత్రాలో హెలికాఫ్టర్ కూలి, పైలెట్ తో సహా 7గురు మృతి చెందారు. వైష్ణవ దేవి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన యాత్రికులు వున్నా హెలికాఫ్టర్ కూలింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం యాత్రికులతో వచ్చిన హెలికాఫ్టర్ కిందకి దింపుతున్న సమయంలో పక్షి వచ్చి డి కొట్టడంతో అదుపు తప్పిన విమానం కులిపోయిందని వివరించారు. ఈ ప్రమాదం లో ఆరుగురు యాత్రికులతో సహా విమాన పైలట్ కూడా మృతి చెందాడు.

జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రమాదం జరగడం చాలా విచారకరమని , మృతులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి కారణమైన వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

English summary

helicopter Crashed in Jammu and Kashmir. Piligrims of Vyshno devi died in this incident.Total 7 members died along with pilot of the plane