వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా!

Affair between Ram Gopal Varma and Poonam Kaur

03:20 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Affair between Ram Gopal Varma and Poonam Kaur

అబ్బో అందరూ ఒకటంటే తాను మరొకటి అంటూ ప్రతీ దాని పై ఏదో వ్యాఖ్య చేస్తూ తరచూ వివాదాస్పదం అయ్యే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అందరికీ ఐటమ్ అయ్యాడు. అన్ని విషయాల్లో తనదైన స్టైల్లో సెటైర్లు వేసే వర్మ పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే, సీరియస్ ఫేస్ తో దర్శనమిచ్చే వర్మ ఆహ్లాదంగా ఫోటోలో కనిపించడం చాలా రేర్. అలాంటిది బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ కౌర్ తో రాంగోపాల్ వర్మ ఫోటో దిగిన తీరు చూస్తుంటే, మొహం వెలిగిపోతోంది. చాలా ఆనందంగా, ఉల్లాసంగా, హాయిగా కనిపిస్తున్నాడు వర్మ. ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్స్ వర్మ భలే దొరికాడు అంటూ ఆడేసుకుంటున్నారు. కొందరు కూల్... కూల్ అంటుంటే, మరికొందరు వర్మ ఇప్పటికి శాంతించాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఐదుపదుల వయసు దాటినా వర్మకు ఇంకా 'పిల్ల'చేష్టలు పోలేదని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇక అభిమానులైతే 'దటీజ్ వర్మ' అని కొనియాడుతున్నారు. కాగా రిలీజ్ కు సిధ్ధంగా ఉన్న వర్మ లేటెస్ట్ మూవీ ఎటాక్ లో పూనమ్ నెగిటివ్ రోల్ చేసింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంలో దిగిన ఫోటో లా వుంది ఇది.

అటాక్ ట్రైలర్:

English summary

Affair between Ram Gopal Varma and Poonam Kaur. Sensational director Ram Gopal Varma with hot beauty Poonam Kaur.