ఐఎస్‌ ఉగ్రవాదుల తలలు నరికారు

Afghanitan militia Members Cuts 4 ISIS terrorists Heads

06:16 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Afghanitan militia Members Cuts 4 ISIS terrorists Heads

ఆఫ్ఘనిస్థాన్‌ మిలిషియా సభ్యులు నలుగురు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్) ఉగ్రవాదుల తలలు నరికారు. అంతటితో ఆగకుండా వాటిని నడిరోడ్డుపై ప్రదర్శనకు ఉంచారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లోని నాన్‌గర్‌హర్‌ ప్రావిన్స్‌లోని ఆచిన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఉగ్రవాదులకు, స్థానిక మిలిషియా గ్రూపులకు మధ్య భయంకరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. నాన్‌గర్‌హర్‌ ప్రావిన్స్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రభావం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఉగ్రవాదుల అరాచక ఘటనలపై పగతీర్చుకోవడానికి స్థానిక మిలిషియా సభ్యులు దొరికిన నలుగురు ఉగ్రవాదులను తలలు నరికి చంపేసి మెయిన్‌ రోడ్డుపై ప్రదర్శనగా ఉంచారని స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ తాలిబన్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌ డిప్యూటీ స్పీకర్‌ హాజి జహీర్‌కు అనుకూలంగా ఉన్న మిలిషియా గ్రూప్‌ అటు ఐఎస్‌ ఉగ్రవాదులకు, ఇటు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతోంది.

English summary