ఆ రాజుకి 100 మంది భార్యలు, 500 మంది పిల్లలు

Africa King has 500 children and 100 wives

03:21 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Africa King has 500 children and 100 wives

కొద్దిరోజుల క్రితమే చైనాకు చెందిన ఒక వ్యక్తి 16 మందిని పెళ్లి చేసుకుని వాళ్ళని ఒకేసారి గర్భవతులను చేసి రికార్డుకెక్కాడు. ఇది మరువక ముందే మరో రికార్డు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికాలోని కెమరూన్ దేశంలో బఫుట్ అనే గిరిజన ప్రాంతముంది. అక్కడ ఓ వ్యక్తి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడి రాజుకు ఏకంగా వందమంది భార్యలు ఉన్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే తండ్రి మరణించిన తర్వాత... అక్కడ రాజైన వారు తండ్రి భార్యలను కూడా భార్యగా చేసుకోవచ్చు. ప్రస్తుతం అబుంది రెండో రాజు భార్యల సంఖ్య 100 మంది.

ఆయన తండ్రి 72 మంది మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన 1968లో మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత.. అబుంది 200 మందిని పెళ్లాడాడు. అందులో తండ్రి భార్యలు కూడా ఉండటం గమనార్హం. దీంతో, వందమంది భార్యలు ఉన్న వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఆయనకు ఎంతమంది పిల్లలో వింటే కళ్లు తిరగాల్సిందే. ఆయన భార్యలందరికీ కలిపి 500 మంది సంతానం. అబుంది ఇక్కడి ప్రాంతానికి 11వ రాజు. అతను పెళ్లి చేసుకున్న వంద మంది భార్యల్లో తండ్రి భార్యలే ఎక్కువగా ఉన్నారు.

English summary

Africa King has 500 children and 100 wives