పాక్ కెప్టెన్ ఇండియాలో ఉండిపోతాడా

Afridi Planning To Settle In India

05:23 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Afridi Planning To Settle In India

భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూ ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు భారత్ , పాకిస్తాన్ లోని అభిమానులే కాక ప్రపంచం మొత్తం ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుందంటే అర్ధం చేసుకోవచ్చు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ఏంటో.

తాజాగా ఇండియా వేదికగా జరుగుతున్నా ప్రపంచకప్ లో భాగం గా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే . దీంతో పాకిస్తాన్ లో పాక్ జట్టు పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్ళ పై కుడా ఎలాంటి తీవ్ర చర్యలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ సహార్యార్ ఖాన్ మాట్లాడుతూ అఫ్రిది పాకిస్తాన్ కు వచ్చిన వెంటనే కెప్టెన్సీ పదవి నుండి తప్పిస్తామని చెప్పారు. అంతేకాక ఒక్క కెప్టెన్సీ నుండి తీసి వెయ్యడమే కాక ఆటగాడిగా ఉండాలనుకుంటే కనుక అతడిని పాకిస్తాన్ జట్టులో ఉంచాలా లేదా అన్న విషయమై ఆలోచిస్తామని కుండ బద్దలు కొట్టారు .

ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ జట్టు టీ20 అదెందుకు భారత్ కు వచ్చినప్పుడు అఫ్రిది మాట్లాడుతూ తనకు పాకిస్తాన్ లో కంటే ఇండియాలోనే ఎక్కువ మంది అభిమానులున్నారని , భారత్ లో దొరుకుతున్నటువంటి ప్రేమాభిమానాలు పాకిస్తాన్ లో కుడా దొరకడం లేదని వ్యాఖ్యానించాడు. తాను క్రికెట్లో కెరీర్ లో చివరి దశలో ఉన్నానని అఫ్రిది అనడం మరో విశేషం.

ఇలా అఫ్రిది వ్యాఖ్యల పై భగ్గుమన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అఫ్రిది పై వేటు ఖాయమని ప్రకటించిన నేపధ్యంలో అఫ్రిది క్రికెట్ కు వీడ్కోలు పలికి ఇండియాలోనే ఉండిపోతాడన్న వార్తలు వస్తున్నాయి.

అఫ్రిది వల్ల నాకు కడుపొచ్చింది

త్రిష బికినీ పార్టీ అదిరింది

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బ్రస్సెల్స్

అతని పర్మిషన్‌తోనే అన్నీ చేస్తున్న రెజీనా

రోజా సీను మారింది - హైకోర్టులో చుక్కెదురు

English summary

Pakistan Cricket Team Captain Sahid Afridi was planning to Settle in India.Pakistan Cricket Board Chairman has said that they decided to Dismiss Afridi as Captain of Pakistan Cricket Team.