టీ20 వరల్డ్ కప్ లో అఫ్రీదీనే కెప్టెన్

Afridi To Continue As Captain For T20 World Cup

04:10 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Afridi To Continue As Captain For T20 World Cup

ఆసియా కప్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించకపోయినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా స్టార్ ఆటగాడు షాహిద్ అఫ్రీదీనే కొనసాగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని అఫ్రిదినే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. అయితే ఆసియాకప్‌లో బలహీనమైన బంగ్లాదేశ్‌ చేతిలో ఓడటాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తోంది. క్రికెటర్ల ఆటతీరు మార్చుకోవాలని బోర్డు హెచ్చరిస్తూ.. ఓపెనర్ ఖుర్రంపై వేటు వేసింది. వరల్డ్ కప్ లో ఖుర్రం స్థానంలో టీ20ల్లో అనుభజ్ఞుడైన అహ్మద్‌ షెహజాద్‌ను జట్టులోకి తీసుకుంది. 40 టీ20 మ్యాచ్‌లాడిన షెహజాద్‌ 941 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి.

English summary

Pakistan Cricket Board (PCB) has decided to continue Pakistan Senior player Shahid Afridi as T20 captain for T20 World Cup.Pakistan also recalled Ahmed Shehzad in place of Opener Khurram.