16 ఏళ్ళ తరువాత పొంగిన హుస్సేన్ సాగర్(వీడియో)

After 16 years Hussain Sagar was boiled

06:53 PM ON 31st August, 2016 By Mirchi Vilas

After 16 years Hussain Sagar was boiled

హైదరాబాద్ మహానగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి పాత రికార్డులు బద్దలవుతున్నాయి. 16 ఏళ్ల తర్వాత హుస్సేన్ సాగర్ ఫుల్లుగా నిండిపోయి నీళ్లు బయటకు పొంగిపొర్లే పరిస్థితి ఏర్పడింది. నీటిమట్టం రికార్డు స్థాయిలో 513.41 అడుగులకు చేరడంతో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా హుస్సేన్ సాగర్ గేట్లను ఎత్తివేసి నీటిని బయటకు వదిలారు. దాదాపు 300 క్యూసెక్కుల నీటిని బయటకు వదలాలని జిహెచ్ఎంసి అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. ఇక రోడ్లు, ట్రాఫిక్ సంగతి సరేసరి.

నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమై నదులు, కాలువల్లా మారిపోయాయి. నాలాలు పొంగి ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరాయి. హుస్సేన్ సాగర్ నీటిని బయటకు వదులుతున్న దృశ్యాలు ఒకసారి కింద వీడియోలో చూడండి..

ఇది కూడా చదవండి: జుట్టుకు రంగేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఇది చదవండి..

ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడుతున్న బాహుబలి టీం(వీడియో)

ఇది కూడా చదవండి: నిద్రలో ఉన్నప్పడు పడిపోతున్నామనే భావన ఎందుకు కలుగుతుంది?

English summary

After 16 years Hussain Sagar was boiled