'కుమారి' తరువాత 'డైరెక్టర్‌'!

After Kumari hit now Director

11:25 AM ON 28th December, 2015 By Mirchi Vilas

After Kumari hit now Director

క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా మారి కథ అందించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. పూర్తి బోల్డ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుని మంచి లాభాలే తీసుకొచ్చింది. ఈ చిత్రం విజయోత్సాహం తో సుకుమార్‌ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. మరో సారి నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందిస్తున్న ఈ చిత్రానికి 'డైరెక్టెర్‌' అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి 'కుమారి' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తారో లేదా కొత్త డైరెక్టర్‌తో తెరకెక్కిస్తాడా అన్న విషయం తెలీదు. దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు మళ్లీ ఈ చిత్రానికి పని చేస్తారు. అయితే కుమారికి చేసినట్లు ఫ్రీగా కాదు 'డైరెక్టర్' చిత్రానికి వచ్చే లాభాలు పారితోషికంగా ఇస్తానని సుకుమార్‌ చెప్పారు.

కుమారి 21f హీరోయిన్ హెబ్బా పటేల్ ఫొటో షూట్ చూడండి

English summary

After Kumari 21F super hit Sukumar is again producing and giving a story for another film. And it is titled as 'Director'.