అది చూశాక నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు!

After watching Baahubali -2 nobody will marry me

04:07 PM ON 8th February, 2016 By Mirchi Vilas

After watching Baahubali -2 nobody will marry me

'బెంగుళూరు నాట్కల్‌' సక్కెస్‌ మీట్‌లో పాల్గొన్న రానా తాను నటిస్తున్న 'బాహుబలి -2' చిత్రం గురించి కొన్ని విషయాలు చెప్పాడు. బాహుబలి కంటే బాహుబలి-2 ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని, ఇందులో వచ్చే గ్రాఫిక్స్‌, సెట్టింగ్స్‌, యుద్ధ సన్నివేశాలు బాహుబలి కంటే 100 రెట్లు బాగుంటాయని వాఖ్యానించాడు. అంతే కాదు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు రానా. అదేంటంటే 'బాహుబలి -2' చూశాక నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. ఇందులో నేను అంత క్రూరంగా ఉంటా అని సరదాగా చెప్పాడు రానా. అంటే ఈ మాట విన్నాక రానాని రాజమౌళి ఎంత క్రూరంగా చూపిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

బహుశా ఇంత క్రూరుడ్ని ఏ సినిమాలోని చూసి ఉండరని బాహుబలి మేకర్స్‌ చెప్తున్నారు. ఏదేమైనా బాహుబలి-2 కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది.

English summary

Rana Daggubati said that after watching Baahubali -2 nobody will marry me. After this statement just imagine that how he was cruel in this movie.