పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానం మళ్ళీ హద్దు మీరింది!

Again clash between Ntr and Pawan Kalyan fans

11:57 AM ON 9th September, 2016 By Mirchi Vilas

Again clash between Ntr and Pawan Kalyan fans

ఈ మధ్యే తిరుపతిలో ఫాన్స్ మధ్య గొడవలు తలెత్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ప్రాణాలు కోల్పోయిన ఘటన సమసిపోక ముందే, మా హీరో గొప్పంటే, మా హీరో గొప్పంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. పవన్ అభిమాని వినోద్ రాయల్ హత్య జరిగి నెల కూడా గడవక ముందే మరోసారి అభిమానం వెర్రితలలు వేయడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ విడుదలైంది. అందులో కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగాలను హైలెట్ చేస్తూ కొందరు ఫ్యాన్స్ ఫేస్ బుక్ లో పోస్టింగ్స్ పెడుతున్నారు. ఎమోషనల్ సీన్స్ రక్తి కట్టించడంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడని ఫ్యాన్స్ పోస్ట్ చేశారు.

1/3 Pages

అయితే ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అంతటితో ఆగితే బాగుండేది. అభిమానుల అత్యుత్సాహం పక్క హీరోల నటనను విమర్శించే స్థాయికి వెళ్లడమే ఇక్కడ అసలు సమస్య. అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ లో పవన్ నటనను, జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ నటనను పోలుస్తూ పెట్టిన ఓ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ పోకడలకు పవన్ ఫ్యాన్స్ ఏమీ మినహాయింపు కాదు. మా హీరోను విమర్శిస్తూ ఫోటో పెడతారా అంటూ పవన్ ఫ్యాన్స్ కూడా ఓ ఫోటో పోస్ట్ చేశారు. 50 కోట్ల మార్క్ కూడా చేరుకోలేని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా స్పందించారు.

English summary

Again clash between Ntr and Pawan Kalyan fans.