అమ్మకు గుండెపోటు... మళ్ళీ ఐసీయూకి..

Again heart attack for Jayalalitha

10:52 AM ON 5th December, 2016 By Mirchi Vilas

Again heart attack for Jayalalitha

గత సెప్టెంబరు 22వ తేదీ నుంచి తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో చేన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే జయకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూకు తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు తరలివచ్చారు. గత సెప్టెంబరులో డీహైడ్రేషన్, తీవ్ర జ్వరం తదితరాల కారణంగా స్థానిక గ్రీమ్స్ రోడ్డులో వున్న అపోలో ఆసుపత్రిలో జయ చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

లండన్ కు చెందిన అవయవ ఇన్ఫెక్షన్ చికిత్సా నిపుణుడు డాక్టర్ పీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సింగపూర్ ఫిజియో థెరపీ వైద్యులు ఇచ్చిన చికిత్స కారణంగా ఆమె కోలుకోవడంతో గత 19వ తేదీన ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు మార్చారు. మొత్తానికి 50రోజులుగా ఆమె ఆసుపత్రికి పరిమితమయ్యారు. మరోపక్క అభిమానులు పూజలు - ప్రార్ధనలు చేస్తూనే ఉన్నారు.

English summary

Again heart attack for Jayalalitha