ఇది చూశాక అమ్మ ప్రేమకు హేట్సాఫ్ చెప్పాల్సిందే...

Again shows mother's love

05:42 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Again shows mother's love

అమ్మ ప్రేమకు ఎందరో ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. భాష్యాలు చెప్పారు. పాటలు, కవితలు ఇక సరేసరి... కానీ ఈ సంఘటన చూసాకా అమ్మ ప్రేమకు హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. ఏమిటి అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్దాం. ఓ అమ్మ తన రెండేళ్ల బాబుతో కలిసి తండ్రి ఇంటికి బయలుదేరుతుంది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపు.. ఆమె డ్రైవ్ చేస్తున్న కార్ అదుపుతప్పి.. ఫెన్సింగ్ ను ఢీ కొట్టుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. వెంటనే అక్కడి జనాలు లోయలో పడిన కార్ చుట్టూ గుమ్మిగూడారు. నీళ్లల్లో పడిన తల్లి డానీ, తన రెండేళ్ళ బాబు కోసం ఇండీ..ఇండీ..ఇండీ అని అరుస్తుంది.

అమ్మ మాటలు విన్న బాబు. ఏడ్వడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన అక్కడి వారు నీళ్లల్లో పడి ఉన్న బాబును బయటికి తీసారు. హుటాహుటిన తల్లికొడుకులను ఆసుపత్రికి తరలించారు. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. బాబు మాత్రం చిన్నపాటి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో తల్లికి ట్రీట్ మెంట్ జరుగుతుంది. అదే సమయంలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. బాబు ఏడుపు విని తల్లి స్పృహలోకొచ్చింది. వెంటనే తన బాబును చూపించాలని, హాస్పిటల్ సిబ్బందిని కోరింది. వాళ్లు బాబును తీసుకొచ్చి ఇవ్వడంతో ఆమె ఆ హాస్పిటల్ బెడ్ మీదే తన పిల్లాడికి పాలు ఇచ్చింది.

తాను ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పటికీ.. పిల్లాడి ఏడుపుకి తట్టుకోలేక పాలిచ్చిన డానీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఆ అమ్మకు నెటిజన్ల నీరాజనాలు పలుకుతున్నారు.

English summary

Again shows mother's love