పోలీసు ఉద్యోగాలకు ఏజ్ పెంచారు!

Age limit has been increased for police jobs

03:04 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Age limit has been increased for police jobs

పోలీసు అవ్వాలనే ఎంతో మందికి కల నెరవేరే సమయం ఆసన్నమయింది. పోలీసు అవ్వాలని కలలు కనే వారికి ఏపీ పోలీస్ శాఖ త్వరలో ఓ శుభవార్త ఇవ్వనుంది. పోలీసు ఉద్యోగాలకు భారీగా నియామకాలకు ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలతో సంబంధం లేకుండా రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు(ఏపీఎస్ఎల్ఆర్బీ) ఆధ్వర్యంలో చేపట్టే నియామకాల్లో సమూల మార్పులు తీసుకు రాబోతోంది. ముఖ్యంగా పోలీసు శాఖలో చేరాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అడ్డంకిగా ఉన్న వయో పరిమితిని సడలించేందుకు సిద్ధమైంది.

1/5 Pages

ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని రెండేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ఇంజనీరింగ్ పట్టభద్రులకు, టెక్నాలజీపరంగా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతోంది. అందులో ఆరువేలకు పైగా పోలీసు ఉద్యోగాలున్నాయి. ఇందులో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే వారు ఇంటర్ తో పాటు 18-22 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

English summary

Age limit has been increased for police jobs