ఇకపై ఆ.. ఆట ఆడాలంటే 18 ఏళ్ళు ఉండాల్సిందేనట!

Age restriction for this game

10:48 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Age restriction for this game

ప్రస్తుతం ఒలంపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ, మెడల్స్ కైవసం చేసుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే చాలా ఆటలు వయస్సుతో సంబంధం లేకుండా ఆడచ్చు. చిన్నా పెద్దా.. తేడా లేకుండా ఎన్నో ఆటలను మనం చూస్తూనే ఉంటాం... ఆడుతూనే ఉంటాం. కానీ వింతగా 18 ఏళ్ళు నిండితే గాని ఈ ఆటను ఆడే అర్హత రాదూ అంటూ మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. ఇంతకీ ఏంటి ఆ... ఆట అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళ్ళాల్సిందే..

1/3 Pages

శ్రీకష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు పలు వేడుకలు ఉంటాయి. ఇక మహారాష్ట్రలో దహీ హండీ వేడుకలు(ఉట్టి కొట్టడం) పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఒకరిపై ఒకరు ఎక్కి, మానవ పిరమిడ్ లా ఏర్పడి పైన వేలాడుతున్న పెరుగు కుండను కొట్టడమే ఈ ఆట ప్రత్యేకత. అయితే దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, స్వాతి పటేల్ అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. 18 ఏళ్ల లోపు పిల్లలు దహీహండీలో పాల్గొనరాదంటూ 2014లో తీర్పు స్పష్టం చేసింది.

English summary

Age restriction for this game