సీఐడీ కస్టడీలో  అగ్రిగోల్డ్‌ యాజమాన్యం

Agri Gold Management Into CID Custody

05:10 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Agri Gold Management Into CID Custody

ఎట్టకేలకు అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణలు పశ్చిమగోదావరి జిల్లా న్యాయస్థానం అనుమతితో వారం రోజులు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నిందితులను ఏలూరులోని జిల్లా సబ్‌జైలు నుంచి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు నిమిత్తం వారంరోజులు వారిని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యాలను ఇక్కడి నుంచి తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు పెద్దఎత్తున జైలుకు వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి సంఘటనలు జరుగకుండా వారిని అక్కడి నుంచి పంపించేశారు. గత కొన్నాళ్ళు గా ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ గా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో కేసు వేగవంతంగా ముందుకు నడుస్తోంది. బాధితులకు న్యాయం చేయడం కోసం ఆస్తుల జప్తుకి చర్యలు అలానే మొదలయ్యాయి.

English summary

Agri Gold victims as West Godavari District Principal Sessions Judge (In-charge) after rejecting the bail petition of Agri Gold Company Chairman Avva Venkata Rama Rao and Managing Director Avva Venkata Seshu Narayana allowed the CID officials to take both the accused into their custody for interrogation.