రాజధాని రైతులు  ఆందోళన పడొద్దు ...

Agricultre Minister Of A.P Says Capital Farmers To Not Worry

05:37 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Agricultre Minister Of A.P Says Capital Farmers To Not Worry

అమరావతి రాజధాని రైతుల ఆందోళన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని ముసాయిదా ప్రణాళికపై రైతులు కొంతమేర ఆందోళన చెందుతున్నారని అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ సర్వే చేసిన దానికి, జాయింట్‌ కలెక్టర్‌ చేసిన సర్వేకు కొంత తేడా ఉందని ఆయన చెబుతూ, జేసీ సర్వే చేసిన దాన్ని ఫైనల్‌ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామకంఠాల విషయం పరిష్కరిస్తామ ని ఆయన సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణం కూడా గ్రామస్థుల అంగీకారంతోనే చేపడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి రాగానే 29 గ్రామాల్లోని రైతు కమిటీలు, జన్మభూమి కమిటీలతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేస్తూ, రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

English summary

Andhra Pradesh Agriculture Minister Prathi Paati Pulla Rao SayS that the who farmers who had given their agricultural land to Andhra Pradesh News Capital Construction was not to worry about the benefits that government promised them