సవర బంగారం, సెల్‌ఫోను, సెట్‌టాప్‌ బాక్సు,...అన్నీ ఫ్రీ ఫ్రీ

AIADMK Party Manifesto In Tamil Nadu Elections

01:38 PM ON 6th May, 2016 By Mirchi Vilas

AIADMK Party Manifesto In Tamil Nadu Elections

విద్యార్థుల విద్యారుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రతి ఇంటికీ వంద యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తు సరఫరా. దీనివల్ల 88 లక్షల కుటుంబాలకు అసలు విద్యుత్తు బిల్లే ఉండబోదు. మహిళలు ద్విచక్రవాహనం (మోపెడ్‌/స్కూటీ) కొనుక్కుంటే దానికయ్యే వ్యయంలో 50 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. పేద యువతులు వివాహం చేసుకుంటే వారికి ఉచితంగా సవర(8 గ్రాములు) బంగారం ఇస్తారు. మహిళా ఉద్యోగినుల ప్రసూతి సెలవును ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు పొడిగింపు.రేషన్‌కార్డున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా మొబైల్‌ ఫోను....అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఉదయం వేళ అల్పాహారం సంక్రాంతి కానుకగా రూ.500 బహుమతి కూపన్‌...ఈవన్నీ ఏమిటి అనుకుంటున్నారా ? ఇంకేముంది ఎన్నికల వేళ తమిళనాట అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఎన్నికల మానిఫెస్టో ఇది.ఇవే కాదు ఇంకా చాలా వున్నాయి.

ఇవి కూడా చదవండి:ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టి షాక్ ఇచ్చిన మొసలి

అంగన్‌వాడీల్లోని పిల్లలకు సి విటమిన్‌ బిళ్లలు...ఆవిన్‌(ప్రభుత్వ ఉత్పత్తి) పాలు లీటరు రూ.25కే లభ్యం... పేదలకు సులభంగా రుణాలు లభించేలా, ప్రభుత్వ పథకాలన్నీ అందేలా ‘అమ్మా బ్యాంకింగ్‌ కార్డు’లు ... ప్రతి ఇంటికీ ప్రభుత్వమే ఉచితంగా కేబుల్‌ టీవీ చూడానికి వీలుగా సెట్‌టాప్‌ బాక్సు అందజేత ...11, 12వ తరగతి విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకం కొనసాగించడంతో పాటు వారికి ఇకపై ఉచితంగా ఇంటర్ నెట్ సదుపాయం....ఇలా ఉచితాల హారంతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి జయలలిత గురువారం సాయంత్రం ఈ రోడ్డులోని పెరుందురైలో జరిగిన ప్రచారసభలో విడుదల చేసారు. తమిళనాట ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలను విడుదల చేయగా, జయలలిత మాత్రం నామినేషన్ల పర్వం ముగిసినా, విడుదల చేయకుండా ఉత్కంఠ రేపారు. ఇప్పుడు విడుదల చేసి , ప్రత్యర్ధులను ఖంగు తినిపించారు.

ఇవి కూడా చదవండి:ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

ఇవి కూడా చదవండి:‘కాబిల్’ శాటిలైట్ రైట్స్ 45 కోట్లట!

English summary

Jaya Lalitha Party AIADMK Party was released Election Manifesto.Jaya Lalitha manisfesto wwitgh the offers like No FDI in retail,Rs. 40,000 crore loans for farmers in 2016-21,Govt. to reimburse education loan,Free wi-fi at public spaces,Housing loand for govt. employees to be raised to Rs. 40 lakh etc