మంగళగిరిలో ఎయిమ్స్ కి శంకుస్థాపన 

AIIMS In Andhra Pradesh

11:40 AM ON 19th December, 2015 By Mirchi Vilas

AIIMS In Andhra Pradesh

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కి శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేసి నడ్డా శంకుస్థాపన చేసారు. కేంద్రమంత్రులు ఎం వెంకయ్య నాయుడు ,సిఎమ్ చంద్రబాబు శిలాఫలకం ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎపికి ఎయిమ్స్ మంజూరయింది.

దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో 1,618 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ నిర్మాణం చేస్తారు. 900 పడకల ఆసుపత్రిగా ఎయిమ్స్ నిర్మాణం అవుతుంది. 100 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మూడేళ్ళలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

కేంద్ర మంత్రులు సుజనా చౌదరి , అశోక్ గజపతి రాజు , ఎంపి లు గల్లా జయదేవ్ , మాగంటి బాబు , డాక్టర్ కంభంపాటి హరిబాబు , గోకరాజు గంగరాజు , రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు , ప్రత్తిపాటి పుల్లారావు , డిల్లీలో ఎపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు , పలువురు ఎం ఎల్ ఏలు , అధికారులు , అనఃదికారులు పాల్గొన్నారు.

English summary

All India Institute Of Medical Sciences (AIIMS) Foundation Cermony Was Held In Mangalagiri,Andhra Pradesh. To this cermony Central Ministers JC Sadda, Venkayya Naidu were attended as cheif guests cheif guests