ఆ విమానం ఎందుకు కూలింది?

Air Asia Plane Crashed Due To Rudder Control System Problem

04:27 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Air Asia Plane Crashed Due To Rudder Control System Problem

గత యేడాది ఎయిర్‌ ఏషియాకు చెందిన ఎయిర్‌ బస్‌ ఎ320 విమానం కూలిన ప్రమాదంలో సుమారు 162 మంది ప్రయాణికులు మరణించారు. ఇండోనేషియా నుండి సింగపూర్‌ కు బయలుదేరిన విమానం జావా సముద్రంలో కూలింది.

ఇండోనేషియా విమానాశ్రయం నుండి బయలు దేరిన 40 నిమిషాలకే విమానం తాలుకు సంభందాలు తెగిపోయాయి . అసలు ఈ విమానం ఎందుకు కూలిపోయిందని దానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డ విచారణ అధికారులు దాదాపు సంవత్సరం తరువాత విమానం ఎందుకు కూలిపోయిందన్న సమాచారాన్ని వెల్లడించారు.

విమానం ఎగురుతున్న సమయంలో విమానంలో ఉన్న రడ్డర్‌ కంట్రోల్‌ సిస్టం తో తలెత్తిన లోపం కారణంగానే విమానం కూలిపోవడానికి అసలు కారణమని విచారణ అధికారులు తెలిపారు. రడ్డర్‌ కంట్రోల్‌ సిస్టంను బాగు చేసే పనిలో పడ్డ విమాన పైలట్‌కు పలుమార్లు అదే సమస్య ఎదురైందని. దీంతో విమానపైలట్‌ రడ్డర్‌ కంట్రోల్‌ సిస్టంను బాగు చేసేందుకు పైలట్‌ కొన్ని కనెక్షన్లను తీసివేశాడని తెలిపారు. కనెక్షన్లను తీసివేయడంతో విమానంలోని ఆటో పైలట్‌ నుండి కూడా సమాచారం ఆగిపోయిందని దీంతో విమాన పైలట్లకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో విమానం ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించిందని తెలిపారు. విమానాన్ని మళ్లీ సరైనా దారిలోకి తీసుకురావడానికి పైలట్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నం విఫలం కావడంతో చివరకు ఎయిర్‌ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిందని విచారణాధికారులు స్పష్టం చేసారు . విమానాన్ని మైంటైనన్స్ డిపార్టుమెంటు వారు సరిగ్గా బాగు చేసి రడ్డర్‌ కంట్రోల్‌ సిస్టం బాగా పని చేసి ఉండేదని , దాంతో విమానం కూలిపోకుండా ఉండేదని అన్నారు.

English summary

Last year december air asia's aeroplane airbus a320 has crashed in java sea. Investigation team has started to know the reasons behind the crash of an aeroplane. Investigation team says that the problem occured in rudder control system cuases the crash of the plane in java sea