ఫ్లైట్ లో చుక్కలు కనిపించాయ్

Air Canada flight turbulence

12:26 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Air Canada flight turbulence

కొత్త సంవత్సర వేడుకలను ఇంట్లో జరుపుకునేందుకు విమానంలో బయలుదేరిన వారికి చుక్కలు కనిపించాయి.

ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ 777 వారికి నరకం చూపించింది. గాల్లోనే ప్రయాణికులను కుమ్మేసి, కుదిపేసింది. ప్లేన్‌లో ఏర్పడ్డ అల్లకల్లోలంతో సీట్లలో కూర్చున్నవారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. కొందరు అమాంతంగా సీట్ల నుంచి ఎగిరి పడ్డారు. ఒక్కసారిగా ప్లేన్ జర్క్ ఇవ్వడంతో ప్రయాణికులు విమానానికి గుద్దుకున్నారు. బ్యాగేజ్ కంపార్ట్‌మెంట్లకు ఢీకొన్నారు. చాలా సేపు సీట్ల నుంచి ఊడిపడి గాల్లో తేలారు. చైనాలోని షాంఘై నుంచి కెనడాలోని టొరంటోకు వెళ్తున్న విమానంలో ఈ ఘోరం జరిగింది. ఆ ఘటనలో 21 మంది గాయపడ్డారు. టోరంటోకు వెళ్తున్న బోయింగ్ విమానాన్ని అకస్మాత్తుగా దారి మళ్లించి కాల్గరి ఎయిర్‌పోర్టులో దించేశారు. విమానం అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో టర్బలెన్స్‌కు గురైంది. దాంతో ప్లేన్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కింద మీద పడ్డారు. ఆ సమయంలో అరుపులు, కేకలతో విమానం దద్దరిల్లింది. తలలపై ఉన్న ఆక్సిజన్ మాస్క్‌లు వేలాడాయి. చాలా మంది ప్రయాణికుల తల, మెడకు గాయాలయ్యాయి. విమానం ఆటుపోట్లకు గురైనప్పుడు అందులో సుమారు 332 ప్యాసింజెర్లు ఉన్నారు.

English summary

Air Canada flight turbulence