ఫ్లైట్ లో కొట్టుకున్న ఎయిర్ హోస్టెస్ లు

Air Hostes Fight In Aeroplane

06:59 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Air Hostes Fight In Aeroplane

ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు కొట్టుకోవడంతో విమానాన్ని అత్యవసరంగా దించేసిన ఘటన అమెరికాలో జరిగింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్‌ 757-200 విమానం లాస్‌ ఏంజెల్స్‌ నుంచి మిన్నియాపొలిస్‌కి వెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌లు వాదనకు దిగారు. వారికి సర్ది చెప్పేందుకు వెళ్లిన మూడో ఎయిర్‌హోస్టెస్‌కు చెంప పగిలింది. విషయం తెలుసుకున్న పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ అధికారుల అనుమతితో విమానాన్ని సాల్ట్‌లేక్‌ సిటీలో దించేశాడు. క్రమశిక్షణారహితంగా ప్రవర్తించిన ముగ్గురు సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు. అధికారులు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయగా తిరిగి ఫ్లైట్ మిన్నియాపొలిస్‌కి చేరుకుంది విమానం. ఈ నేపథ్యంలో జరిగిన ఆలస్యానికి గాను విమానంలోని 300 మంది ప్రయాణికులను క్షమాపణలు కోరుతూ డెల్టా ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం లేఖ రాసింది.

English summary

Delta Airlines flight Airplane grounded following mid-air because of two cabin crew employees fight each other.This incident was occurred in America.This Aeroplane was landed in Salt Lake city and later AirLines was dismissed three accused employees.