అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

Air hostess Sangeeta Chatterjee arrested in West Bengal for smuggling

11:35 AM ON 11th May, 2016 By Mirchi Vilas

Air hostess Sangeeta Chatterjee arrested in West Bengal for smuggling

ఎర్రచందనం కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. రెడ్‌సాండిల్ అక్రమ తరలింపులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తాజాగా మాజీ ఎయిర్‌ హోస్టెస్ అయిన సంగీత ఛటర్జీని రెండు రోజుల కిందట అరెస్ట్ చేశారు. ఆమెను చిత్తూరుకి తీసుకొచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎర్రచందనాన్ని దేశం సరిహద్దులు దాటించేందుకు బెంగాల్‌కు చెందిన సంగీత చటర్జీ ఆమె భర్త లక్ష్మణ్ కీలకపాత్ర పోషించారని అధికారులు తెలియజేసారు. ఏపీ నుంచి సముద్ర మార్గం ద్వారా కోల్‌కతాకు.. అక్కడ నుంచి చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు రవాణా అవుతున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి.

ఇది కూడా చదవండి: ఏ దానం చేస్తే ఏమొస్తుంది.. దాని వల్ల కలిగే లాభాలు

ఈ స్మగ్లింగ్ వెనుక లక్ష్మణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలుసుకున్న అధికారులు అరెస్ట్ చేసి చిత్తూరు జైలుకి తరలించారు. అయినా ఎర్రదుంగల స్మగ్లింగ్ యధేచ్చగా సాగడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆయన భార్య, మాజీ ఎయిర్‌హోస్టెస్ అయిన సంగీత ఛటర్జీ పై నిఘా పెట్టారు. పోలీసుల అంచనా నిజం కావడంతో రెండు రోజుల క్రితం ఆమెను కోల్‌కతాలో అరెస్ట్ చేసారు. ఆమె నుంచి 10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు సంగీతకు సంబంధించిన ఐదు బ్యాంకు ఖాతాలు కూడా సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలో సంగీత పై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: ప్రభాస్ ఇంటి గురించి మీకు తెలియని విషయాలు

గతంలో సంగీత మోడల్‌గా కూడా వ్యవహంచి పలు యాడ్స్‌లో నటించింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన సంగీతకు ప్రముఖులతో పరిచయాలున్నాయి. ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, బెంగుళూరులకు చెందిన స్మగ్లర్లతో నెట్‌వర్క్‌ని ఈమె ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

English summary

Air hostess Sangeeta Chatterjee arrested in West Bengal for smuggling. Air hostess Sangeeta Chatterjee areested for smuggling Red Sandalwood.