ఎయిర్ ఇండియాలో ఆ ఇద్దరూ కొట్టుకున్నారు

Air India Employees Fight In Flight

05:24 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Air India Employees Fight In Flight

అవును, గాల్లో తేలాల్సిన విమానాన్ని రన్ వే మీద ఆపేసి , ప్రయాణికులను గాలికొదిలేసి మరీ ఆ ఇద్దరూ కొట్టుకున్నారు. వివరాలోకి వెళితే, ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే ఎయిరిండియా విమానంలోని ఫ్లైట్‌ అటెండెంట్లు ఇద్దరు కొట్టుకుని రెండు గంటలకుపైగా విమానాన్ని రన్‌వేపైనే ఆపేసి ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురిచేసారు. గురువారం సాయంత్రం 5-45 గంటలకు ఈ ఫ్లైట్‌ బయలుదేరాల్సి ఉంది. కేబిన్‌లోని ఒక మహిళా ఉద్యోగి, మరో పురుషుడి మధ్య వ్యక్తిగత విషయమై చిన్న వాదన మొదలై తీవ్ర ఘర్షణకు దారితీసి రాత్రి 8 గంటలదాకా కొనసాగింది. విమానంలో సీపీఎం సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఐఏఎస్‌లు ఉన్నా, ఈ ఇద్దరూ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరికి ఆపరేషన్స్‌ ఇన్‌చార్జి రంగంలోకి దిగారు. ఫలితంగా ఆ ఇద్దరినీ ఫ్లైట్‌ నుంచి దింపేసి మరో ఇద్దరికి విధులు అప్పగించారు. ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేసి, ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా క్షమాపణ చెప్పింది

English summary

The national carrier's Delhi-Thiruvanthapuram flight was to take off at 5.45 pm. Passengers boarded the plane on time. But the flight didn't take off -- till 8 pm because of two Air India crew employess fight for almost two hours by stopping flight on Run way.Later they two were suspended by the Air India Officials.